రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
భారత రూపాయి విలువ జీవిత కాల కనిష్టానికి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డాలర్‌కు 85 రూపాయల విలువకు చేరుకుంది. దీనితో దేశవ్యాప్తంగా వస్తు, సేవల విలువలు విపరీతంగా పెరుగుతున్నాయి. విదేశీ బ్యాంకులు వివిధ అవసరాల కోసం డాలర్స్‌ను సేకరిస్తుండడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగా ఔట్ ఫ్లో పెరిగిపోయింది. దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ప్రయాణిస్తోంది. దీనివల్ల డాలర్ విలువ పెరిగిపోయింది.