మహేశ్, రాజమౌళి చిత్రంపై రూమర్స్..
సూపర్ స్టార్ మహేశ్, దర్శక ధీరుడు రాజమౌళి కలిసి పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రంపై సినీ అభిమానులకు ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం అమెజాన్ అడవుల్లో, ఒరిస్సా సరిహద్దుల్లోని అడవుల్లో నిర్మించబడుతోందని తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై వచ్చిన రూమర్ ఏంటంటే ఇది రెండు భాగాలుగా నిర్మిస్తున్నారని, సీక్వెల్ ఉంటుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇది నిజం కాదని, ఈ చిత్రం లెంగ్త్ ఎక్కువైనా ఒకే సినిమాగానే రాజమౌళి పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. బాహుబలితో సీక్వెల్ ట్రెండ్‌ను మొదలుపెట్టిన రాజమౌళి ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా తీస్తారనే ప్రచారం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మూడున్నర గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తుందని, మహేశ్ బాబు డేట్స్ కూడా రెండు చిత్రాలకు దొరకడం కష్టమవుతుందని రాజమౌళి అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, తర్వాత ఒడిశాలో పూర్తయ్యింది. ప్రస్తుతం మహేశ్ బాబు బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో విదేశాలకు వెళుతున్నట్లు సమాచారం.