రేవంత్-ఆదాని టి షర్డులపై రగడ
తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద సోమవారం ఉద్రిక్తతత చోటు చేసుకుంది.కేటిఆర్ సహా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలంతా రేవంత్-ఆదాని దోస్తానా అంటూ వారిరువురి బొమ్మలున్న టిషర్టులు ధరించి అసెంబ్లీలోకి రాబోతుండగా పోలీసులు,సెక్యురిటీ సిబ్బంది వారిని గేటు దగ్గరే అడ్డగించారు.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లోపలికి ప్రవేశించబోతుండగా వీరిని నిలువరించారు. దీంతో ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నిరశన తెలిపే హక్కుని ఉద్దేశ్యపూర్వకంగా కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. కేఆటిర్ అయితే ఓ అడుగు ముందుకేసి పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లవేళలా పరిస్థితులు ఇలానే ఉండబోవని హెచ్చరించారు.

