నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్దం
ఉలవపాడు మండలం మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద హైవేపై శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 19 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి తిరువూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.బస్సు నిండా పొగ అలముకోవడంతో బస్సుని రహదారిపైనే నిలిపివేసి ప్రయాణీకులను సినీ ఫక్కీ తరహాలో దించేశారు.దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ప్రయాణీకుల్లో 8 మంది వృద్దులు కూడా ఉండటం గమనార్హం. ఆర్టీసి సిబ్బంది,అధికారులు,పోలీసులు,రవాణా శాఖాదికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

