Home Page SliderNational

రూ. 99 కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణం

ఇక నుంచి రూ. 99కే హైదరాబాద్ -బెంగళూరు ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ వార్త నిజమా కాదా అని నమ్మశక్యం కావట్లేదా? అయితే ఈ వార్త చదివితే మీకే తెలుస్తోంది. జర్మనీకి చెందిన ట్రావెల్ అగ్రిగేటర్ అయిన FlixBus దక్షిణ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. దీని సేవలు సెప్టెంబర్ 10న ప్రారంభం కానున్నాయి. రూ. 99కే హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు FlixBus తెలిపింది. అందుబాటు ఛార్జీలతో, స్థిరమైన ప్రయాణానికి అంతర్జాతీయ బ్రాండ్ గా ఉన్న FlixBus దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై మార్గాల్లో బస్సులను కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలు, మౌలిక మంత్రి ఎంబీ పాటిల్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ అంతటా మరో 33 నగరాలను జోడించడం ద్వారా కంపెనీ తన పరిధిని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చివరికి దక్షిణ భారతదేశం అంతటా 200 కనెక్షన్లను అందిస్తోంది. పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వాత, FlixBus ఇండియా దేశవ్యాప్తంగా 101 నగరాలు మరియు 215 స్టాప్‌లను కలుపుతుంది. ఈ సందర్భంగా రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ను సంస్థ ప్రకటించింది. ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 11-అక్టోబరు 6 మధ్య ఉండాలి.