రూ. 371కోట్ల విలువైన 53కేజిల డ్రగ్స్ పట్టవేత
నాణ్యమైన విదేశీ డ్రగ్ విలువ దేశీయ బహిరంగ మార్కెట్‌లో కేజి రూ. 7కోట్ల కు పైనే ధర పలుకుతుంది.అలాంటి డ్రగ్ ని విక్రయిస్తున్న ముఠా సభ్యులను తెలంగాణా పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు.దాదాపు 53 కేజిలు అంటే రూ.371కోట్ల విలువైన డ్రగ్స్‌ని మధ్య ప్రదేశ్ నుంచి తెచ్చి తెలంగాణాలో గుట్టు చప్పుడు కాకుండా వివిధ ప్రాంతాల్లో పెడ్లర్ డీలర్లకు విక్రయిస్తున్న గ్యాంగ్‌ని పట్టుకున్నారు.ఇందులో ముగ్గురుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించగా మరికొంత మంది పరారీలో ఉన్నారు.వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.