రాష్ట్రంలోని ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు
అమరావతి: మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే, మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య అందజేస్తామని చెప్పారు. ఇమామ్, మౌజమ్‌లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులు చేసినా, వక్ఫ్ ఆస్తులను మైనారిటీల ద్వారానే సంరక్షిస్తామని స్పష్టం చేశారు. ఆస్తుల పారదర్శకత కోసం వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ చేపట్టి, అందరికీ పరిశీలించేలా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

