Home Page SliderTrending Today

నాకు రూ.30 వేల జీతం సరిపోకే..దొంగతనం చేశాను

ఇటీవల కాలంలో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. కాగా దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగతనం చేసిన వ్యక్తి మరెవరో కాదు ఐశ్వర్య ఇంట్లో పనిమనిషి అని తేలింది. దీంతో పనిమనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేయగా ఆమె ఈ దొంగతనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల విచారణలో పనిమనిషి తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను ఎందుకు దొంగతనం చేశావని ప్రశ్నించగా ఆశ్చర్యపరిచే విధంగా సమాధానమిచ్చింది. అదేంటంటే నాతో వెట్టి చాకిరీ చేపించుకుంటున్న రజినీకాంత్ కూతురు ఐశ్వర్య నాకు కేవలం రూ.30 వేల రూపాయలు మాత్రమే జీతమిస్తున్నారు. అయితే ఆ జీతం నాకు ఏమాత్రం సరిపోవట్లేదని తెలిపింది.అందుకే ఈ దొంగతనానికి పాల్పడ్డానని చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగా ఐశ్వర్య ఇంట్లో చిన్న చిన్న వాటిని దొంగిలించి..చివరకు బంగారు నగలు ఎత్తుకుపోయానని వెల్లడించింది.  అంతేకాకుండా ఐశ్వర్య ఇంట్లో దొంగిలించిన సొమ్ముతో ఆ పనిమనిషి ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.