మాయమాటలతో రెండో భర్తకు రూ.2 కోట్ల టోకరా..
హైదరాబాద్‌లోని టోలిచౌకీ సబ్జా కాలనీకి చెందిన సయ్యద్ హుస్సేన్ (38) అనే వ్యాపారవేత్త నిలువునా మోసపోయాడు. మాయమాటలు చెప్పి, అబద్దాలతో అతనని రెండవపెళ్లి చేసుకుని రూ. 2 కోట్లకు టోకరా కొట్టి, పైగా బెదిరింపులకు పాల్పడుతోందో కిలాడీ లేడీ. జమీలా(31) అనే మహిళ నాలుగేళ్ల క్రితం పరిచయమై తాను గచ్చిబౌలి ఫైనాన్షియల్ మై హోమ్ విహంగలో ఉంటానని, విదేశాలలో వ్యాపారాలు ఉన్నాయని, సినీ ప్రముఖులు తనకు తెలుసంటూ మోసం చేసింది. ఆమె మాటలు నమ్మిన సయ్యద్ స్నేహంగా మెలిగాడు. అయితే తనను వివాహం చేసుకోవాలని ఇబ్బంది పెట్టగా ఒప్పుకోకపోవడంతో తప్పుడు పత్రాలు సృష్టించి వివాహం చేసుకుంది. అతని వ్యాపారాలలో రూ.కోటికి పైగా నగదుని జమీలా, ఆమె తల్లి కలిసి ఖర్చు చేశారు. అతని ఐఫోన్ నుండి మరో రూ.80 లక్షలు తన ఖాతాలో జమ చేసుకున్నారు. ఆమె వ్యవహారాలపై ఆరా తీసిన సయ్యద్‌కు జమీలాకు గతంలోనే ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తితో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారని తెలిసింది. దీనిపై నిలదీయగా, అతనని ఆమె నివాసానికి రాకుండా కట్టడి చేసి, విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.