రూ.1.50 కోట్ల నకిలీ యాంటి బయోటిక్స్ సీజ్
తెలంగాణలోని ములుగు మండలం కరకపట్ల గ్రామంలో అక్రమంగా భారీ ఎత్తున నిల్వ ఉంచి యాంటీ బయోటిక్స్ ని స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 1.50కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. జోడాస్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ నకిలీ బయోటిక్స్ ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నకిలీ ఔషధాలు తయారీ తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.