ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న “RRR”
ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. కాగా రాష్ట్రరాజకీయాలు గంటకో మలుపు తిరుగుతూ..అధికార,ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంపీ రఘురామ కృష్టంరాజు వీటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఏపీ సీఎం జగన్ గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటివరకు తన ఫోటోలు పెట్టుకుని MLAలు గెలిచారని సీఎం జగన్ చెప్పారన్నారు.కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల పనితీరు బాగోలేదు అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం ఒకసారి పులివెందులలో YCP పరిస్థితిపై సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలే అని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.

