Home Page SliderTelangana

GHMC కమీషనర్‌గా రోనాల్డ్ రోస్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణాలో గత కొన్ని సంవత్సరాలుగా లోకేష్ కుమార్ GHMC కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే తెలంగాణా ప్రభుత్వం ఇటీవల లోకేష్ కుమార్‌ను బదిలీ చేసింది. కాగా లోకేష్ కుమార్ స్థానంలో IAS అధికారి రోనాల్డ్ రోస్‌ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ GHMC కమీషనర్‌గా రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కమీషనర్‌ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు.