Home Page SliderNationalNews AlertSports

కామెంటేటర్లపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా క్రికెట్ కామెంటేటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చెందిన కామెంటేటర్లు క్రికెటర్ల వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ఆట నైపుణ్యం గురించి కాకుండా వివాదాలు సృష్టిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని, ఒకసారి ఇతర దేశాల వారి కామెంట్రీ వింటే బాగుంటుందని సెటైర్ వేశారు. క్రికెట్ జర్నలిజం లైక్‌లు, కామెంట్ల చుట్టూ తిరుగుతోందన్నారు. ప్లేయర్లకు గౌరవం ఇవ్వకుండా వారు ఎందుకు ఫామ్‌లో లేరో తెలుసుకోకుండా ఒక ఎజెండాతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.