‘ఏనుగమ్మా ఏనుగు మాఊరొచ్చింది’ రోబోటిక్ ఏనుగు
రోబోట్‌లు రెస్టారెంట్లు, హాస్పటల్స్, షాపింగ్ మాల్స్ దాటుకుని ఇప్పుడు దేవాలయాల్లో కూడా అడుగుపెడుతున్నాయి. మనుష్యుల రూపంలో, కుక్కల రూపంలో రోబోట్లను చూసాం. కానీ అతి పెద్ద జంతువైన ఏనుగు రూపంలో రోబోట్‌ను తయారు చేయడం నిజంగా వింతే. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని శ్రీకృష్ణ దేవాలయానికి అరుదైన బహుమతి నిచ్చారు ‘పెటా ‘(people for the ethical treatment of animals india )సంస్థ వారు. ఇక్కడ కృష్ణ దేవాలయానికి ప్రతిఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో ఏనుగులు అప్పుడప్పుడు జనంపై దాడి చేయడం, పాదాలతో తొక్కివేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆలయ ఆచార వ్యవహారాలను నిర్వహించేందుకు ఈ రోబో ఏనుగును బహుమతిగా అందించారు. ఈ ఏనుగుకు రామన్ అనే పేరు పెట్టారు. ఈ ఏనుగు తొండం ఆడించడం, తోక ఊపడం, నీరు చిమ్మడం వంటి సాధారణ ఏనుగు చేసే పనులను చేస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియోలో చాలా వైరల్ అవుతోంది.

