‘ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు’..మండిపడ్డ సీతక్క
ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిథూరీపై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా మారుస్తానని ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై సీతక్క తీవ్ర విమర్శలు గుప్పించారు. బిథూరీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై బీజేపీ నాయకులకు ఎంత చిన్నచూపు ఉందో ఈ కామెంట్లను బట్టి అర్థం అవుతోందని, ఇలాంటి వాళ్లకు టిక్కెట్ ఇస్తే, మహిళలు స్వేచ్ఛగా తిరగగలరా అంటూ ప్రశ్నించారు. ప్రజలు తప్పకుండా ఎన్నికలలో బీజేపీకి బుద్ది చెప్తారని పేర్కొన్నారు.

