Breaking NewsHome Page SliderTelangana

రైట్ …రైట్ …ఢిల్లీ టు హ‌స్తిన ..సీఎం ఇంట‌ర్ సిటీ టూర్‌.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి పోస్టుకు ఎస‌రొచ్చి ప‌డింది. గ‌త ఏడాదిన్న‌ర నుంచి వివాదాస్ప‌ద పాలన సాగిస్తున్నారంటూ అటు బీజెపి,ఇటు బీ.ఆర్‌.ఎస్‌.పార్టీలు ఆరోపిస్తుండ‌టం, రేవంత్ చేసే చ‌ర్య‌లు కూడా అలానే ఉండ‌టంతో టిపిసిసి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి.దీంతో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జిని మార్చాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.మీనాక్షి న‌ట‌రాజ‌న్ బాధ్య‌త‌లు తీసుకోగానే….కాంగ్రెస్ రూలింగ్ పైనే దుమ్మెత్తి పోస్తున్న వివాదాస్ప‌ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై వేటు వేశారు.అంత‌టితో ఆగ‌కుండా సీఎం అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లోనూ ఉత్త‌మ్‌కు ప్రాధాన్య‌త పెంచారు.దీంతో రేవంత్ కి సీన్ అర్ధ‌మైపోయింది.మ‌రో వైపు అధిష్టానం కూడా ప‌దే ప‌దే ఢిల్లీకి రావాల‌ని పిలిచి అక్షింత‌లు వేయ‌డంతో స్టేట్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుందో అంద‌రికీ అర్ధ‌మైపోయింది.బీజెపికి రేవంత్ అనుకూలంగా ఉన్నార‌న్న విమ‌ర్శ‌లు,ఆరోప‌ణ‌లు కూడా సొంత పార్టీ నుంచి తలెత్తుతున్నాయి.దీంతో సీఎం మార్పు అనివార్యంలా మారింది.ఈ నేప‌థ్యంలో గ‌త నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో మూడు సార్లు హ‌స్తిన ప‌ర్య‌ట‌న చేసిన రేవంత్ మ‌ళ్ళీ ఈ రోజు కూడా ఢిల్లీ వెళ్ల‌నున్నారు.దీంతో విప‌క్షాలు సెటైర్లు మీద సెటైర్లు విసురుతున్నాయి.