ఏపీ రాష్ట్రాన్ని పేదగా మార్చిన దేశంలోనే ధనిక సీఎం
చంద్రబాబు హయాంలో అభివృద్దిలో పరుగులు పెట్టిన ఏపీ..వైసీపీ హయాంలో పేదరికంలోకి కూరుకుపోతుందని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. కాగా భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం జగన్.. ఏపీని మాత్రం పేద రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆయన సీఎంపై సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుంతుదన్నారు. ఈ విధంగా ఏపీని నాశనం చెయ్యాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో ఈ నాశనాన్ని అంతమొందించడం ఒక్క టీడీపీకే సాధ్యమన్నారు. కాగా రాష్ట్రంలో జగన్ పాలనతో నిరాశ చెందిన ప్రజలు ఇప్పుడు ఆదరణ కోసం చంద్రబాబు వైపు చూస్తున్నారన్నారు. కాబట్టి ఏపీలో రాబోయే ఎన్నికలలో విజయం సాధించేది టీడీపీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని ఎంపీ కేశినేని నాని హామి ఇచ్చారు.

