గ్రీన్ కోని ఇబ్బంది పెడితే పాపం తగులుతుంది రేవంత్
సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. గ్రీన్ కో సంస్థ అన్నీ పార్టీలకు ఎన్నికల వేళ డబ్బులు ఇస్తుందని అలాంటి సంస్థ మీద కూడా కేసులు పెట్టడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ సహా అన్నీ పార్టీలు ఆ సంస్థ నుంచి డబ్బులు తీసుకుని ఎన్నికల్లో ఖర్చుపెట్టుకుంటాయన్నారు.గ్రీన్ కో సంస్థ నుంచి డబ్బులు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీకి ప్రమాణం చేసే దమ్ముందా అని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.గ్రీన్ కో ని ఇబ్బంది పెడితే పాపం తగిలి మట్టిగొట్టుకుపోతారని ఆయన హెచ్చరించారు.