ఛరఖా తిప్పిన రేవంత్ రెడ్డి..
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మంగళవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. అప్పట్లో మహాత్మ గాంధీ వాడిన చరఖాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆశ్రమంలోని ఛరఖాని ఆసక్తిగా తిప్పి చూశారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను అక్కడి నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. తర్వాత ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ ప్రత్యేక కార్యక్రమాల, సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆయన గుజరాత్ చేరుకున్న సంగతి తెలిసిందే.

