Home Page SliderTelangana

“రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు”: కేటీఆర్

తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ అసెంబ్లీలో సీఎం రేవంత్‌ను ఏకవచనంతో సంభోదించారు. కాగా కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు అన్నారు. ఆయన నాకు 18 ఏళ్ల నుంచి తెలుసు అన్నారు. అయితే గత 10 ఏళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. కాగా రేవంత్ చిన్న వయస్సులోనే సీఎం అయినందుకు అదృష్టవంతుడు అని కేటీఆర్ పేర్కొన్నారు.అయితే దీనిపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తన మాటలను వెనక్కి తీసుకున్నారు.