“రేవంత్ తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు”..మాజీ మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల గొంతులను తడిగుడ్డతో కోస్తున్నారని, నమ్మకద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్. ఈ మేరకు ట్విటర్‌లో తన అభిప్రాయాలను తెలియజేశారు. అప్పుల బాధ భరించలేక సిద్దిపేట జిల్లాకు చెందిన యాదగిరి అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఆదాయంతో నిండిన జీవితాలలో ఆత్మహత్య ఆలోచనలు రావడానికి కారణం రేవంత్ రెడ్డే అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న సహాయం చేయలేదని, అన్ని వర్గాల ప్రజలను మోసగించారని, ఏడాది కాలంగా తెలంగాణ తిరోగమిస్తోందని ధ్వజమెత్తారు.