టిక్కెట్లు అమ్ముకోలేదని రేవంత్ ప్రమాణం చేయాలి
చార్మినార్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను డబ్బులు అడిగారని.. ఇవ్వకపోవడంతో తనకు టిక్కెట్ కేటాయించలేదని ఉప్పల్ కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆయనతో పాటు గద్వాల కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన డా.కురుమ విజయ్‌కుమార్ తదితరులు.. మంగళవారం హైదరాబాద్‌లో చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి ఎదుట నిరసన చేపట్టారు. పసుపు, కుంకుమ నీళ్లను బక్కెట్లతో తలపై పోసుకుని ప్రమాణం చేశారు. టిక్కెట్లు అమ్ముకోలేదని రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బహదూర్‌పురా టిక్కెట్ ఆశించి భంగపడిన కలీమ్‌బాబాతో పాటు పలువురు మైనార్టీ కాంగ్రెస్ నేతలు సైతం చార్మినార్ వద్ద నిరసన తెలిపారు.

