Home Page SliderNewsNews AlertPoliticsTelangana

‘వరి వేస్తే ఉరే అనలేదా’..బీఆర్‌ఎస్‌పై రేవంత్ ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంలో విపక్ష బీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని, పదేళ్లుగా రైతులను మభ్యపెట్టారని, వరి వేస్తే ఉరే అని మంత్రులు బెదిరించారని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి వారికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు. గత మహిళా గవర్నర్‌ను అవమానించి 2022 బడ్జెట్ సమావేశాలు ఆమె ప్రసంగం లేకుండానే నిర్వహించారని ఎద్దేవా చేశారు. వాళ్లు వారి అజ్ఞానాన్నే తమ విజ్ఞానమని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”పదేళ్ల విధ్వంసం, నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజలు మార్పును కోరుకున్నారు… అందుకే ప్రజల ఆశీర్వాదంతో మేం ఇక్కడ ఉన్నాం. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే గతంలో తెలంగాణలో పోరాటాలు జరిగాయి. భూమి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కాళేశ్వరంతో పని లేకుండానే రైతులు 1 కోటి 56 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. తెలంగాణ జిల్లాలను వలస జిల్లాలుగా మార్చి రైతులను పొట్టన పెట్టుకున్నారు. ఎస్ఎల్బీసీని నాలుగేళ్లల్లో పూర్తి చేయాల్సింది పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేశారు. మా ప్రశ్నలకు సంధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి వెళ్లిపోయారు. 15 నెలల్లో కెసిఆర్ సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కేసీఆర్” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.