దేశంపై బాధ్యత లేదా..ఇదేం చెత్త పిటిషన్..సుప్రీం ఆగ్రహం
ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లడించింది. పహల్గాం బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపిన కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఇలా స్పందించింది. పిటిషనర్లు దేశంపై బాధ్యతతో వ్యవహరించాలని, ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు అందులో సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలని హెచ్చరించింది. భారత బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి కేసులు వాదించలేమని పేర్కొంది. ఇతర రాష్ట్రాలలో ఉండే కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసం ఈ పిటిషన్‌ను దాఖలు చేశానని పహల్గాం ఘటనపై పిటిషన్ వేసిన వ్యక్తి చెప్పడంతో ఉగ్రవాద ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారు. ఇలాంటి అంశాలను న్యాయపరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించవద్దని పేర్కొంది. దీనితో పిటిషనర్ తన కేసును ఉపసంహరించుకున్నారు.