రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. ఈ లోన్ సదుపాయాన్ని రూ.2 లక్షలకు పెంచుకున్నట్లు పేర్కొంది. జనవరి 1 నుండి ఈ రుణం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. దీనిద్వారా సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ రంగంలో రైతుల వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రుణ సదుపాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.