భారీ హిమపాతంలోనూ సహాయక చర్యలు..ఇంకా 8 మంది మంచుదుప్పట్లో..
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లోని మానా గ్రామం వద్ద మంచు చరియలు విరిగి పడడంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీ హిమపాతం పడుతున్నా మోకాళ్ల లోతు మంచులో భారత సైన్యంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ బృందాలు విజయవంతంగా 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకురావడం ఎంతో గొప్ప విషయం. అయితే మరో 8 మంది కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు. వారి జాడ తెలియక గాలిస్తున్నారు. రక్షించిన వారిని హుటాహుటిన హెలికాఫ్టర్ల ద్వారా దగ్గర్లోని జోషిమఠ్‌కు తరలించారు. వారిలో 7గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం. జోషిమఠ్‌కు నేడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ దామి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆయనకు ప్రధాని మోదీ ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీశారు.

