రూట్ మార్చిన హైడ్రా..
హైదరాబాద్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదంతో గడగడలాడించిన హైడ్రా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తన రూట్ మార్చి ఈసారి ప్రజల వద్ద నుండి కూడా అర్జీలు స్వీకరిస్తామని పేర్కొంది. ప్రతీ సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.