పీఎస్‌ఆర్‌కు రిమాండ్..
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు సీఐడీ కోర్టు మే 7 వరకూ రిమాండ్ విధించింది. నిన్న పీఎస్‌ఆర్‌ను సీఐడీ పోలీసులు నటి జెత్వానీ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన తన వాదనలు తానే వినిపించుకున్నారు. తనకు నటి జెత్వానీ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కేసులో సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్న మరో ఇద్దరు పోలీస్ అధికారులకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరయ్యింది.