crimeHome Page SliderInternationalNews

మతపెద్ద అరాచకం..50 ఏళ్ల జైలుశిక్ష

“ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్” అనే గ్రూప్ సంస్థకు సంబంధించిన 20 మంది మహిళలను భార్యలుగా పేర్కొంటూ లైంగికదాడికి పాల్పడ్డాడు మతపెద్ద. వారిలో 10 మంది మైనర్ బాలికలు. శామ్యూల్ బాటెమ్యాన్ అనే మత నాయకుడు వివిధ దేశాల నుండి బాలికలను అక్రమ రవాణా చేసి, తన లైంగిక వాంఛను తీర్చుకునేవాడని కోర్టులో స్వయంగా అంగీకరించాడు. దీనితో అతనికి 50 ఏళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. బాధితురాళ్లకు ఒక్కొక్కరికీ మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నిందితుని ఆస్తులన్నీ జప్తు చేశారు. 2022లో నిందితుడి నివాసంలో 11 నుండి 14 ఏళ్ల వయసున్న బాలికలను పోలీసులు కనిపెట్టారు. వారిని వివిధ దేశాల నుండి తన అనుచరుల ద్వారా కిడ్నాప్ చేసి అక్రమంగా రవాణా చేసినట్లు విచారణలో తేలింది. దీనితో అతడిని అరెస్టు చేశారు.