ఆ ముగ్గురు ఐపిఎస్‌లను రిలీవ్ చేయండి
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కేంద్ర హోం శాఖ నిఘా పెట్టింది. సివిల్ సర్వెంట్ల పోస్టింగులు,బదిలీలపై ప్రత్యేక దృష్టిసారించింది.ఇందులో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వాల సీఎస్‌లను కూడా కేంద్రం పరిధిలోనే జరగుతుండటంతో బీజెపి ఆపరేష్ తెలంగాణ కోసం ..శాంతి భద్రతల అంశాన్ని ఎంత కీలకంగా భావించిందో అనేది అర్ధమౌతుంది.అంతే కాదు…ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీ.ఎస్.ఆర్.ఆంజనేయులు,సునీల్ కుమార్ వంటి ఐపిఎస్‌లపై శాఖా పరమైన చర్యలకు ఉపక్రమించిన సందర్భంలోనూ హోంశాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.