ఫ్యోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీకి బెయిల్
తెలంగాణలో సంచలనం కలిగించిన ఫ్యోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. ప్రధాన నిందితులలో ఒకరైన అతనికి సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఈ కేసులో మొదటి బెయిల్ ఆయనకే లభించింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. దీనిని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించి, మరి కొన్ని షరతులపై బెయిల్ ఇచ్చింది. అవసరం అయితే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించవచ్చని పేర్కొంది. అయితే కేసు విచారణకు సహకరించాలని తిరుపతన్నను ఆదేశించింది. మరో నిందితుడు డీసీపీ రాధా కిషన్ రావు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. కీలక నిందితునిగా భావిస్తున్న టాస్క్ ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పోల్ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.


 
							 
							