మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిన్నెల్లి వేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన బెయిల్ పై ఉన్నఆంక్షలను సడలిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఎన్నికల పోలింగ్ రోజు, తరువాత పిన్నెల్లి పై పలు కేసులు నమోదై ఆయన జైలుకు కూడా వెళ్లారు. తరువాత షరతులతో కూడిన బెయిల్ కోర్టు గతంలో మంజూరు చేసింది. ఈ మేరకు పాస్ పోర్ట్ ను కూడా పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు హైకోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లనున్నారు.