వారణాసి నుండి కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
వారణాసి కేంద్రంగా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు ప్రధాని మోదీ. ప్రదానిగా మొదటి సంతకం చేసిన కిసాన్ సమ్మాన్ నిధులను నేడు 9 కోట్ల 26 లక్షల మంది ఖాతాలో జమ చేశారు. 17 వ విడత నిధులలో 20 వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా పేర్కొన్నారు. అర్హులైన రైతుల ఖాతాలలో రూ.2 వేల చొప్పున నగదు జమ అయ్యింది. వారణాసి ప్రజలకు తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ కాశీ విశ్వనాధుడు, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మరోమారు గెలిపించారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.