బిగ్‌బాస్ విన్నర్‌పై కేసు నమోదు
ప్రముఖ పాపులర్ తెలుగు టెలివిజన్ షో బిగ్‌బాస్ నిన్నటితో ముగిసింది. కాగా ఈ సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కాగా బిగ్‌బాస్ విన్నర్‌గా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు ఆయన అభిమానులు హౌస్ బయట ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ హౌస్ బయట తన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో బిగ్‌బాస్ హౌస్ బయట బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ అభిమానులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్,అమర్ దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలో వారు కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు అద్దాలను పగుల గొట్టారు. అంతేకాకుండా వారు అశ్వినీ,అమర్ దీప్,గీతు రాయల్ కార్లను కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేసే గీతు రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వాగ్వాదానికి కారణమైన పల్లవి ప్రశాంత్,అతని అభిమానులపై సీరియస్ అయ్యారు. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకుగాను అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.