Home Page SliderNational

వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గింపు

పెరుగుతున్న ధరల భారంతో బెంబేలెత్తుతున్న సామాన్యులకు ఉపశమనం. వాణిజ్య అవసరాలకు వియోగించే గ్యాస్ సిలెండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను 99.75 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1680 రూపాయలకు దిగి వచ్చింది. అంటే దాదపు 100 రూపాయలు తగ్గింది. దీనితో అందరూ సంతోషపడుతున్నారు. దేశవ్యాప్తంగా చమురు సంస్థలు తమ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను సవరించడంతో ఇది సాధ్యమయ్యింది. కానీ గృహ వినియోగ సిలిండర్ ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. ఈ ధరలు నేటి నుండి అమలు కానున్నాయి.