రికార్డు బద్దలైంది..బంగారం లక్షకు చేరింది
గత కొన్ని వారాలుగా పరుగులు తీస్తున్న బంగారం ధర అనుకున్నట్లుగానే లక్ష రూపాయలకు చేరింది. సామాన్యులకు అందని ద్రాక్షలా ఆల్ టైం రికార్డు ధరకు చేరింది. తాజాగా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1 లక్ష రూపాయలకు చేరింది. హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,200 దాటింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఈ రోజు రూ. 98,350 వద్ద మొదలై, సాయంకాలానికి రూ.1 లక్షకు చేరింది. అక్షయ తృతీయ సమీపిస్తుండడంతో బంగారం కొనుగోళ్లు బాగా పెరిగాయి.

