NationalNews

రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఇక్కడి నుంచి ఆయన ఫామ్‌హౌస్ వరకు కొనసాగనుంది. ఆయన అంతిమ యాత్ర కనకమామిడి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న అనంతరం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు సినీ,రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి,సంతాపం తెలియజేశారు. ఈ అంతిమయాత్రలో కృష్ణంరాజు కుటుంబ సభ్యలు,సన్నిహితులు,అభిమానులు కడసారిగా ఆయనకు కన్నీటి వీడ్కోలు తెలుపుతున్నారు.