ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిషేధం.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆనందంలో, ఆర్‌సీబీ యాజమాన్యం బెంగళూరులో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. అయితే, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, 11 మంది అభిమానులు మృతి చెందడం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దురదృష్టకర సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి మరో షాక్ తగలనుంది. ఐపీఎల్ నుండి ఆర్సీబీని నిషేధిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు, ఆర్‌సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆర్‌సీబీకి చెందిన ఒక ఉన్నతాధికారిని అరెస్టు చేయగా, కేఎస్‌సీఎకు చెందిన ఇద్దరు అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ తీవ్రమైన సంఘటనను బీసీసీఐ సుమోటోగా స్వీకరించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించి, కప్పు గెలిచిన ఆనందం ఆవిరికాకముందే, జట్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకోవడం వారిని కలవరపరుస్తోంది. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.