డిగ్రీ విద్యార్థులకు ఆర్బీఐ బంపర్ ఆఫర్
డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు ఆర్బీఐ బంపర్ ఆఫర్ అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఏర్పడి 90 ఏళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న డిగ్రీ విద్యార్థులకు ఆర్బీఐ 90 పేరుతో క్విజ్ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. ఈ పోటీలో జాతీయస్థాయిలో గెలుపొందిన వారికి రూ.10 లక్షల రూపాయల బహుమతి గెలుచుకునే అవకాశం ఉంది. దీనికోసం ఈ నెల 17వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో పాల్గొనాలంటే కళాశాల నుండి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. కనీసం ఇద్దరితో బృందాల వారీగా ఏర్పడాలి. జిల్లాస్థాయి, రాష్ట్ర, జోనల్ స్థాయి, జాతీయ స్థాయిలలో పోటీలు నిర్వహిస్తారు. ఇంగ్లీష్, హిందీ భాషలలో పోటీలు ఉంటాయి. ఈ క్విజ్‌లో ప్రధానంగా దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, సాహిత్యం, చరిత్ర, శాస్త్ర సాంకేతిక రంగాలు, కరంట్ ఎఫైర్స్ వంటివి ఉంటాయి. విద్యార్థులలో దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేశారు.

స్థాయి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి
రాష్ట్ర రూ.2 లక్షలు రూ.1.5 లక్షలు రూ.1 లక్ష
జోనల్ రూ.5 లక్షలు రూ.4 లక్షలు రూ.3 లక్షలు
జాతీయ రూ.10 లక్షలు రూ.8 లక్షలు రూ.6 లక్షలు