మహాళల పేరుతోనే రేషన్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీకి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కొత్త దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసిన వారికి కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు పోస్ట్‌కార్డు సైజులో ఉండేలా రూపొందిస్తున్నారు. కార్డుపై ప్రభుత్వ లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ఉండే అవకాశం ఉంది. రేషన్ షాపు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్ తదితర సమాచారంతోపాటు, ఆధునిక సాంకేతికతగా బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ పొందుపరిచే యోచనలో ఉన్నారు.ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుమీద అందజేస్తోంది. అదే విధంగా, రేషన్ కార్డులను కూడా గృహిణి పేరుమీద జారీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా కుటుంబాలకు సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.

