Home Page SliderLifestyleNationalNews Alert

జాక్‌పాట్ కొట్టేసిన రతన్ టాటా ఫ్రెండ్..

దివంగత రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన యువకుడు శంతను నాయుడు. చివరి రోజులలో రతన్ టాటాకు కేర్‌టేకర్‌గా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. తాజాగా టాటా మోటార్స్‌లో ‘స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌’కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే ఈ స్థాయి పదవి సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని తన లింక్డ్‌ఇన్ పోస్టులో షేర్ చేస్తూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 2018 నుండి 2014 రతన్ టాటా మరణించేవరకూ వీరి అనుబంధం కొనసాగింది. వీరిద్దరికీ గల వీధి శునకాలపై ప్రేమే వీరిని కలిపింది. ఆయన చనిపోయేంత వరకూ ఆయనకు వ్యక్తిగత మేనేజర్‌గా, విశ్వాసపాత్రునిగా ఉన్నారు. ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్’ పేరుతో రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలు, తన నుండి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు.