Home Page SliderNationalNews Alert

కారు వెంట పడ్డ అభిమానులకు రష్మిక సలహా

చెన్నైలోని నెహ్రు ఇండోరి స్టేడియంలో వారీసు సినిమా ఆడియో రీలీజ్‌ ఫంక్షన్‌కు హీరోయిన్‌ రష్మిక మందన్న హాజరైంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో రష్మిక హోటల్‌కు బయల్దేరి వెళుతోంది. అది చూసిన కొందరు ఫ్యాన్స్‌ తమ బైక్‌లపై ఆమెను అనుసరిస్తూ ముందుకు సాగారు. వీరిని రష్మిక గమనించింది. మధ్యలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర ఆమె కారు ఆగింది.  ఓ బైకర్‌ ఆమెకు దగ్గరికి వచ్చాడు. దీంతో రష్మిక కొంత ఆగ్రహంతో హెల్మెట్‌ లేకుండా ప్రయాణించొద్దు, హెల్మెట్‌ పెట్టుకోవాలని కోరింది. అలాగే పెట్టుకుంటామని వారు చెప్పగా, లేదు వెంటనే హెల్మెట్‌ పెట్టుకోవాలని కోరింది. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వారీసు సినిమాలో తలపతి విజయ్‌ సరసన రష్మిక నటిస్తోంది.