Home Page SliderNational

వయనాడ్ బాధితులకు రష్మికా మందన్న రూ.10 లక్షల విరాళం

ఇటీవల కేరళలోని దారుణమైన విషాద సంఘటన జరిగింది. వయనాడ్ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రాత్రికి రాత్రే కింద ఉన్న ఊరు మొత్తం నేలమట్టమైంది. ఎన్నో వేల ప్రాణాలు నిద్దురలోనే కన్నుమూసాయి. దీంతో ఈ ఘోర ఘటన తీవ్ర విషాదంగా మారగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

అలాగే చాలామంది సినీ ప్రముఖులు కేరళ ప్రభుత్వం సంక్షేమ నిధికి విరాళాలు కూడా అందిస్తుండగా తాజాగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న కూడా ఇందులో భాగం అయ్యింది. తన వంతుగా కేరళ ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఆమె అందించి తన ఉన్నత మనసు చాటుకున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో భారీ సీక్వెల్ చిత్రం పుష్ప 2 చేస్తుండగా ఈ సినిమా మాత్రమే కాకుండా తమిళ్‌తో సహా హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో రష్మికా మందన్న నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.