Home Page SlidermoviesNews Alert

ముంబైలో కెమెరాకు చిక్కిన రష్మిక, విజయ్..

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు చాలా ఆసక్తి. వారెక్కడ కనిపించినా, ఎక్కడికెళ్లినా కుతూహలంగా చూస్తూంటారు. ఇటీవల ‘యానిమల్’, ‘పుష్ప-2’ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టిన రష్మిక చాలా సంతోషంగా ఉంది. రష్మిక, ఆమె స్నేహితుడు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు క్లిక్ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ ముంబయి విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. దీనితో వీరిద్దరూ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కోసం విదేశాలకు వెళ్తున్నారని అభిమానులు అనుకుంటున్నారు. ఇటీవల రెస్టారెంట్‌లో వీరిద్దరూ కనిపించిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. వీరి డేటింగ్ రూమర్స్‌పై ఇటీవల ‘పుష్ప-2’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తన స్నేహితుడు ఎవరో అందరికీ తెలుసని రష్మిక చెప్పింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఈ రూమర్స్‌పై సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తానని పేర్కొన్నారు.