BusinessHome Page SliderNationalNews Alert

ర్యాపిడో పింక్ మొబిలిటీ వచ్చేసింది..

ప్రముఖ పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ర్యాపిడో ఇప్పుడు మహిళలకు కూడా రైడింగ్ అవకాశాలను కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సేవలను పింక్ మొబిలిటీ పేరుతో ప్రారంభించింది. దాదాపు 2 లక్షల మంది మహిళలను కెప్టెన్లుగా మార్చాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆటోలు, క్యాబ్‌లు మాత్రమే మహిళలు ఈ సదుపాయం వాడుకుంటున్నారు. ఖరీదు ఎక్కువైనా పురుష డ్రైవర్లు నడిపే  బైక్ ట్యాక్సీలు ఎక్కడానికి సంకోచిస్తున్నారు. కానీ మహిళలే రైడర్లుగా ఉన్న పింక్ మొబిలిటీ ద్వారా మహిళలు కూడా సౌకర్యవంతంగా ఈ సేవలు ఉపయోగించుకునే అవకాశం లభిస్తోంది. రాబోయే మూడేళ్లలో ఈ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ర్యాపిడో సంస్థ పేర్కొంది.