రన్యారావు వయా పిడుగురాళ్ల
కన్నడ నటి రన్యారావు క్రైమ్ కథ రోజుకో రీతిన మలుపు తిరుగుతుంది.పల్నాడు జిల్లా పిడుగురాళ్లతో రన్యారావుకి సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.పిడుగురాళ్లకు చెందిన ప్రముఖ వ్యాపారి తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ దాదాపు రూ.150 కోట్ల మేర వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.రన్యారావుకి పిడుగురాళ్ల బంగారు వ్యాపారికి సంబంధాలున్నట్లు తెలుసుకున్నారు.దీంతో పిడుగురాళ్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఎక్కడో దుబాయ్‌లో ప్రారంభమైన స్వర్ణచిత్ర కథ….ఇలా పిడుగురాళ్ళ వరకు చేరడంతో విస్తుపోతున్నారు.కాగా ఇక్కడి వ్యాపారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.