ఏపీలో ఎమ్మెల్యేలకు ర్యాంకుల టెన్షన్..
ఏపీలో ఇటీవల మంత్రులకు ప్రభుత్వం ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మా జోలికి రారులే.. అనుకున్న ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు ర్యాంకుల టెన్షన్ పట్టుకుంది. సర్కారు పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని ఫైళ్ల క్లియరెన్సును బట్టి మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. దీనిలో సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూడా మినహాయింపు లేకుండా ర్యాంకులు కేటాయించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. వీరికి ఫైళ్లు క్లియరెన్స్ పద్దతి కాకుండా ప్రజలకు ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ చేసి, కూటమి ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరు బాగుందా, పర్వాలేదా, బాగోలేదా అంటూ 1,2,3 అంటూ నెంబర్లు నొక్కమని నియోజక వర్గాల వారీగా ఫోన్లు వస్తున్నాయట. అయితే ఈ పద్దతిపై పలువురు ఎమ్మెల్యేలు పరీక్షలు పెడుతున్నట్లు మాకీ బాధలేంటి? అని వాపోతున్నారట.