రాంగోపాల్ వర్మకి 3 నెలల జైలు శిక్ష
ప్రముఖ సినీ విమర్శకులు,వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష ఖరారైంది.2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది ముంబైలోని అంథేరి కోర్టు. ఫిర్యాదుదారునికి ఆర్జీవీ 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.దీన్ని సవాల్ చేస్తూ ఆయన బాంబే హైకోర్టుని ఆశ్రయించారు.అయితే విచారణకు వచ్చే లోపే ఆయన్ను జైలుకి తరలించాల్సి ఉండగా ప్రస్తుతం ఆర్జీవీ ఆందుబాటులో లేకుండా పోయారు.