crimeHome Page SliderInternational

ఖైదీల‌కు రంజాన్ నీకి

రంజాన్‌ సందర్భంగా ఖైదీలకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడి జైళ్లలోని ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసినట్లు అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ప్రకటించారు. 1295 మంది ఖైదీలను విడుదల చేయడంతో పాటు 1518 మందికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకున్నారు. విడుదలైన వారిలో 500 మందికి పైగా భారతీయులు సైతం ఉన్నారు. ఈ చర్య భారత్‌- యూఏఈల మధ్య బలమైన సంబంధాలను తెలియజేస్తోందన్నారు. దుబాయ్‌ అటార్నీ జనరల్‌, ఛాన్సల్‌ ఇస్సా అల్‌ హుమైదాన్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, స్థానిక పోలీసుల సమన్వయంతో వారి విడుదలకు చట్టపరమైన విధానాలను ఇప్పటికే ప్రారంభించినట్లు వివరించారు. ఈ నిర్ణయం ఖైదీలకు కొత్త జీవితాన్ని అందించడంలో అధ్యక్షుడి అంకితభావాన్ని తెలియజేస్తోందని చెప్పారు.