రామ్‌చరణ్ మూవీ సెట్‌లో క్లీంకార సందడి..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ సెట్స్‌లో రామ్‌చరణ్ ముద్దుల కుమార్తె క్లీంకార సందడి చేసింది. ఈ సెట్స్‌లో క్లీంకారను ఎత్తుకుని ఉన్న ఫోటోను ‘మై లిటిల్ గెస్ట్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు రామ్ చరణ్. ఈ ఫోటోపై రామ్ చరణ్ భార్య ఉపాసన ‘ఫోమో’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వరుణ్ తేజ్ లవ్ సింబల్ పోస్టు చేశారు. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఈ పోస్టు వైరల్ కావడంతో అభిమానులు సంబరపడుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
